24 Jan 2018
18 Dec 2017
19 Nov 2017
గీతామకరందము-01-10
01-10-గీతా మకరందము.
అర్జునవిషాదయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ|| ఇవ్విధముగ తన పక్షమునగల శూరులను పొగడి తదుపరి దుర్యోధనుడు రెండువైపుల గల సేనలను లెక్కగట్టి తన సైన్యమే చాల గొప్పదని నుడువుచున్నాడు –
అపర్యాప్తం తదస్మాకం
బలం భీష్మాభిరక్షితమ్
పర్యాప్తం త్విదమేతేషాం
బలం భీమాభిరక్షితమ్.
తా:- అట్టిశూరులుకల మనసైన్యము భీష్మునిచే గాపాడ బడుచు అపరిమితముగ నున్నది. (అజేయమై యొప్పుచున్నది). పాండవులయొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితముగనున్నది. (జయింప శక్యమైయున్నది.)
వ్యాఖ్య:- ఈ శ్లోకములోని 'అపర్యాప్తం', 'పర్యాప్తం' అను పదముల యర్థమందు భాష్యకారులలో మతభేదము కన్పట్టు చున్నది. ఆనందగిరి, శంకరానందులు మున్నగువారు 'అపర్యాప్త’ పదమునకు అపరిమితమను అర్థమును సూచించిరి. శ్రీధరులు మున్నగువారు అసంపూర్ణము, అసమర్థము అను భావమును ప్రకటించిరి. కాని యిందు మొదటియర్థమే సమీచీనముగ తోచుచున్నది. ఏలననగా దుర్యోధను డిదివఱలో ఉద్యోగపర్వమందు ధృతరాష్ట్రునితోను (ఉ.54–60-70), భీష్మపర్వమున ద్రోణాచార్యునితోను (భీష్మ 51-4-6) తన సైన్యముయొక్క గొప్పతనమును గూర్చి మిక్కుటముగ శ్లాఘించి యుండెను. వారలను ఉత్సాహపరుచు నిమిత్త మావిధముగ నతడు చెప్పి యుండెను. ఇపుడును అదియే సందర్భము కనుక, మఱియొక విధముగ నాతడు చెప్పియుండడు. తన సైన్యమును కించపఱచుకొను అవకాశ మిచట లేదు. శ్లోకము యొక్క ధోరణి స్వపక్షమును కీర్తించునదిగనే యున్నది. కావున "మన సైన్యము చాలకున్నది. పాండవ సైన్యము పరిపూర్ణముగనున్నది' అను నర్థ మిచట సందర్భోచితముగా లేదు. తన సైన్యమును శ్లాఘించుచు భీష్మపర్వమున (51-6) ఇదియే శ్లోకమును దుర్యోధనుడు ద్రోణాచార్యునకు చెప్పినవిషయమున్ను ఇచట గమనించ దగియున్నది.
" భీమాభిరక్షితమ్' - కౌరవసేనకు భీష్ముడధిపతియై యున్నట్లు, పాండవసేనకు ధృష్టద్యుమ్ను డధిపతియై యుండ, ఇట " భీమునిచే రక్షింపబడిన పాండవసేన" అని యేల చెప్పబడినది? ఇందులకు కారణము లివియైయుండ వచ్చును -
(1)భీముడు ధార్తరాష్ట్రులనందఱిని వధించుటకు కృతనిశ్చయుడై యున్నందున దుర్యోధనుని చిత్తమున అతడే స్ఫురించియుండవచ్చును.
(2)ధృష్టద్యుమ్నుడు పాండవసేనకు నాయకుడుగ నియమింపబడినను, సేననంతను కాపాడుచుండుటకు భీముడుకూడ నియోగింపబడెను.
(3)మొదటి దినమున పాండవులచే రచింపబడిన వజ్రవ్యూహముయొక్క రక్షణ కొఱకు దాని యగ్రభాగమునందు భీముడుండెను. కావున సేనారక్షకుడుగ నాతడే దుర్యోధనునకు గన్పట్టియుండవచ్చును.

గీతామకరందము-01-07,08,09
01-07,08,09-గీతా మకరందము.
అర్జునవిషాదయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే||
తా:- ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరుకలరో వారలను జ్ఞాపకముకొఱకు మీకు చెప్పుచున్నాను. (వినుడు).
వ్యాఖ్య:- ప్రతిపక్షవీరులను మాత్రము తెలిపినచో ద్రోణున కొకవేళ అధైర్యము కలుగునేమోయని తలంచి ధైర్యోత్పాదనము కొఱకు స్వకీయ శూరవీరులను గూడ దుర్యోధనుడు తెలుప నారంభించుచున్నాడు.
08
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవ చ * ||
09
అన్యే చ బహవశ్శూరా
మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్ర ప్రహరణాః
సర్వే యుద్ధవిశారదాః ||
తా:- మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొఱకు తమతమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందఱును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్రసంపన్నులై ఇచట నున్నారు.
వ్యాఖ్య:- దుర్యోధనుడు వీరులను పేర్కొనునపుడు తన పక్షమునకు భీష్ముడు సేనాపతి
యైయుండ, ఆతని పేరు ముందు చెప్పక ద్రోణునిపేరు ఏల చెప్పవలసివచ్చెను? ఎదుటనున్న ద్రోణు డేమి భావించుకొనునోయని సందేహించికాని, గురువును ప్రప్రథమమున ఎన్నుకొనుట భావ్యమని తలంచికాని, ద్రోణాచార్యుని ఉత్తేజపఱచు నుద్దేశ్యముతోగాని అట్లు చేసియుండవచ్చును.
రెండు సేనలయందలి శూరవీరులను ద్రోణాచార్యుడెఱిగియున్నను, అతనితో జెప్పునెపమున దుర్యోధనుడు వారలను తిరిగి జ్ఞాపకము చేసికొని బలాబలములను లెక్కించుచున్నాడు.
'త్యక్తజీవితాః' = (ప్రాణములను విడిచిపెట్టినవారు) — అను పదము దుర్యోధనుని ముఖతః వెలువడుటబట్టిచూడ తన వారందఱున్ను నశించియే పోవుదురని ముందుగనే అతని అంతరాత్మ భావించియుండవచ్చునని తోచుచున్నది. ఆ ప్రకారముగ పలుకుట దుర్యోధనునకు దుర్నిమిత్తసూచకమని కొందఱి మతము.
------------------------------------------
*సౌమదత్తిర్జయద్రథః - (పాఠాన్తరము)

18 Nov 2017
గీతామకరందము-01-04,05,06
01-04,05,06-గీతా మకరందము.
అర్జునవిషాదయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ|| దుర్యోధనుడు పాండవపక్షమునగల ముఖ్యయోధుల పేర్లను ద్రోణాచార్యున కెఱింగించుచున్నాడు -
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః ||
ధృష్టకేతు శ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ
శైబ్యశ్చ నరపుంగవః ||
యుధామన్యుశ్చ విక్రాన్త
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః ||
తా:- ఈ పాండవ సేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూరవీరులు పెక్కురుకలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కున్తిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు ఉపపాండవులు. వీరందఱును మహారథులే అయి యున్నారు.
వ్యాఖ్య:- పైన దెల్పిన వీరులందఱు భీమార్జునులతో సమానులని చెప్పుటవలన వారిరువురును శూరాగ్రేసరులనియు, దుర్యోధనునకు భయోత్పాతము కలిగించువారనియు స్పష్టపడుచున్నది. దుర్యోధనుడు స్వపక్షవీరులను గూర్చి ముందుగా దెలుపక పరపక్షనాయకులను వర్ణించి చెప్పుటలో రెండు కారణములు కలవు - (1) ఆచార్యునకు శత్రుసైన్యముపై రోషము కల్పించుట (2) తన సైన్యము విషయమై ధైర్యము తగ్గియుండుట, లేక, తన సైన్యముకంటె ప్రతిపక్ష సైన్యమే బలవత్తరముగ నున్నదను భావము గలిగియుండుట.
“మహారథుడు" - పదివేల ధనుర్ధరులగు యోధులతో ఏకాకిగ యుద్ధము చేయగలవాడును, ఆయుధశాస్త్రమందు ప్రవీణుడునగు శూరుడు మహారథు డనబడును*.
యుయుధానుడు - ఇతనికి సాత్యకి యనియు పేరుగలదు.
ధృష్టకేతువు - చేదిదేశపురాజు, శిశుపాలుని పుత్రుడు.
పురుజిత్, కున్తిభోజులు - కుంతీదేవికి సోదరులు.
ద్రౌపదేయులు - ద్రౌపదిసుతులగు ఉపపాండవులు, ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు - వీరైదుగురున్ను క్రమముగ ధర్మరాజ భీమాదులకు ద్రౌపదివలన గలిగిన సంతానము.
-------------------------
*ఏకోదశసహస్రాణి యోధయేద్యస్తు ధన్వినామ్
శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇతి స్మృతః

16 Nov 2017
గీతామకరందము-01-03
01-03-గీతా మకరందము.
అర్జునవిషాదయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ|| దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఈ ప్రకారముగ పలుకుచున్నాడు –
పశ్యైతాం పాణ్డుపుత్రాణాః
ఆచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా ||
తా:- ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీశిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత వ్యూహాకారముగ రచింపబడియున్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును జూడుడు!
వ్యాఖ్య:- ఈ శ్లోకమునకు ముందు 'దుర్యోధన ఉవాచ' అని యుండవలసినది. కాని అట్లులేదు.
పాపియగుటచే ఆతని నామమును పుణ్యశీలురగు గీతాపాఠకులచే పలుమారు ఉచ్చరింపకుండ జేయుటకే కాబోలు ఆ విధముగ గావింపబడినది!
దుర్యోధనుడు రాజకీయ చతురత గలవాడు. కార్యసాధన నిమిత్తము రాజగు తానే దిగివచ్చి ఒకానొక సేనానాయకునితో (ద్రోణాచార్యునితో) మాట్లాడుటయేకాక, ప్రతిపక్షముపై నాతనికి రోషమునుగూడ కల్పింపజొచ్చెను. ‘ద్రుపదుని పుత్రుడును, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నుడు పాండవసేనలను చక్కగా తీర్చిదిద్దెను - ’ అని పలుకుట ద్వారా యతడు ద్రోణాచార్యునకు ద్రుపదుని యెడలగల పూర్వపు వైరమును జ్ఞప్తికి దెచ్చెను. మఱియు ‘మీకు శిష్యుడుగానున్నవాడే ప్రతిపక్షమునకు నాయకుడై గురువగు మీ పైననే కత్తిగట్టుచున్నాడ’ని తెలిపి ద్రోణాచార్యునకు తీవ్రమగు రోషమును జనింపజేయు చున్నాడు. ఎదిరి పక్షమును, తన్నాయకుని గొప్పగా వర్ణించుటద్వారా స్వపక్షనాయకునకు వారిపై ప్రతీకారభావనను వృద్ధినొందించుటయే దుర్యోధనుని యాశయము.
‘ధీమంతు’డని పేర్కొనబడుటచే ధృష్టద్యుమ్నుడు వ్యూహరచనలో గొప్పనేర్పరి యని తేలుచున్నది. కనుకనే యాతనిని పాండవులు తమ సేనానాయకునిగ నెన్నుకొనియుండిరి.

గీతామకరందము 01-02
01-02-గీతా మకరందము.
అర్జునవిషాదయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ|| ధృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానముగా సంజయు డిట్లు వచించుచున్నాడు -
సంజయ ఉవాచ :-
దృష్ట్వాతు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య
రాజా వచనమబ్రవీత్ ||
తా:- ధృతరాష్ట్రునితో సంజయు డిట్లు వచించెను - అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగ రచింపబడి యున్న పాండవసేనను జూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.
వ్యాఖ్య:- పాండవసేనాపతియగు ధృష్టద్యుమ్నుడు యుద్ధశాస్త్రానుసారముగ తన సైన్యమును వజ్రమను పేరుగల వ్యూహముగ నమర్చియుంచెను. పాండవసేనయొక్క అద్భుత వ్యూహరచన దుర్యోధనున కాశ్చర్యముగొలుప, అంతకంటెను పటుతరముగ తన సైన్యమును నిర్మింపజేయ నుద్దేశ్యముతో కాబోలు వెనువెంటనే ఆ వార్తను గురువగు ద్రోణాచార్యున కెఱింగించెను.
దుర్యోధనుడు రాజు. ప్రభుత్వమున సర్వోన్నతస్థానము నలంకరించినవాడు. అట్టిచో తనకంటె క్రింది స్థానముననున్న ఒకొనొక సేనానాయకుని యొద్దకు తానే స్వయముగ బోవలసిన పనియేమి యను శంక నిచట నుదయించును. ఇందులకు కారణము లివియై యుండవచ్చును -
(1) పాండవుల సైన్యమును, అందును ముఖ్యముగ భీమాదులను జూచి భయపడి దుర్యోధనుడు అధైర్యమును బొంది యుండవచ్చును. (ప్రారంభములోనే రాజు ధైర్యమును గోల్పోవుట అశుభసూచకము).
(2)ద్రోణాచార్యుడు సేనానాయకులలో నొకడు కావున ఆతనిని ఆ స్థానమునుండి కదలించినచో సైన్యమంతయు చెదరిపోవు నవకాశము కలదు.
(3)ద్రోణాచార్యుడు వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు. పైగా గురుస్థానముననున్నవాడు. అట్టివానియెడల విధేయత చూపుట ధర్మము.
(4) ఏదియో విధముగ ద్రోణాచార్యుని మంచిచేసికొని ఆతనిని తన స్వార్థసంపాదనమునకు వినియోగించదలంచి యుండవచ్చును - ఈ యన్ని కారణముల బట్టి దుర్యోధనుడు ఆచార్యుని తన యొద్దకు పిలిపించక తానే ఆచార్యునికడకేగి విన్నవించుకొనెను.