పూజ్య శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి సంక్షిప్త
జీవిత చరిత్ర
1). జన్మ నామము- : శ్రీ తూనుగుంట్ల ఆనందమోహన్
2). జననం: 1914 ఏప్రిల్ 13వ తేది సోమవారం, ఆనందనామ సంవత్సరం చైత్ర బహుళ తదియ
3). జన్మస్థలం: కృష్ణాజిల్లా, బందరు(మచిలీపట్నం), ఆంధ్రప్రదేశ్.
4). తల్లి: శ్రీమతి సుశీలా దేవి గారు
6). విద్యాభ్యాసం: 13వ ఏట విజయవాడ నగరంలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత, 1933లో మచిలీపట్నం లో నోబుల్ కళాశాల నుంచి బి.ఎ ., పట్టభద్రత. ఉత్తరప్రదేశ్-వారణాసి లోని
"కాశీవిద్యాపీఠం" నుంచి హిందీలో "కోవిద" పరీక్షలో ఉత్తీర్ణత, అక్కడే బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి హిందీ లో
రాష్ట్ర భాష, విశారద పరీక్షలలో ఉత్తీర్ణత.
9). ఆధ్యాత్మిక సాధన(తపస్సు): శ్రీ వ్యాసాశ్రమం లో 12 సంవత్సరములు
అపక్వాహారం స్వీకరిస్తూ(కొబ్బరి,పాలు,పండ్లు, గోధుమలు,శనగలు,పెసలు,ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే ఆహార పదార్ధాలు)
11). ఇష్టమైన మహాత్ములు:
శ్రీ
ఆదిశంకరాచార్యులు, శ్రీ స్వామి వివేకానంద, శ్రీ మలయాళ స్వామి, శ్రీ మహాత్మాగాంధీ.
12). గంగానదిలో భగవద్గీత
లభ్యం: ఉత్తరప్రదేశ్, ఋషికేశ్ లో గంగానది లో స్నానం
చేస్తుండగా వీరికి పూలతోనూ, కుంకుమతోనూ పూజింపబడిన పవిత్ర
గీతాగ్రంధ సంస్కృత ప్రతి లబించినది. శ్రీవారి జీవిత లక్ష్యాన్ని నిర్దేశించిన
మహత్తరమైన సంఘటన అది.
13).సన్న్యాస స్వీకారం: 34ఏట 29జూన్ 1947సర్వజిత్ నామ
సంవత్సరము, శ్రీ మలయాళ సద్గురు స్వామి నుండి సన్న్యాస దీక్ష స్వీకరించారు.
15). బిరుదులు: అపరసిద్దార్ద, జగద్గురు, పరమహంస, పరివ్రాజకాచార్యులు.
16). మహాత్మాగాంధీ
సందర్శనం: 1936లో వారణాసి నగరంలో ఆలిండియా
కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగినది, ఆ సమావేశానికి గాంధీజీ హాజరయ్యారు.
గాంధీజీ బసచేసిన కుటీరానికి ఆనంద మోహన్ వాలంటీరుగా నియమింపబడ్డారు. ఆనంద
మోహన్ ఆ రోజుల్లో కాశీవిద్యాపీఠంలో
చదువుతున్నారు.
17). ఆశ్రమ స్థాపన: 37వ ఏట విరోధి నామ సంవత్సర మాఘ శుద్ధి విదియ 20-1-1950 శ్రీ కాళహస్తి
లో శ్రీ శుకబ్రహ్మశ్రమము స్థాపించినారు.
18). మొదటి గీతా జ్ఞాన
యజ్ఞం ప్రారంబం: 2-12-1956 గుంటూరు జిల్లా నరసరావుపేట
లో జరిగింది. 108వ గీతా జ్ఞాన యజ్ఞం 13-5-1982 సికింద్రాబాద్, హైదరాబాద్ లో జరిగింది.
19). 1962 ఫిబ్రవరి 14న ఆనంద వైద్యాలయం ప్రారంభించి 1963లో వేదాంతభేరి
మాసపత్రికను ప్రారంభించి,
1980 లో పేద విద్యార్ధులకు ఆశ్రమం లో భోజన వసతి కల్పించారు.
1982 లో స్వామి విద్యాప్రకాశానంద
గవర్నమెంట్ జూనియర్ కాలేజీ స్థాపించారు.
1985 అక్టోబర్ 23న గీతా పాఠశాల ప్రారంభించారు.
1991 మే 5న మానవునికి "సర్వేంద్రియయాణాం నయనం పధానం", కన్ను లేనిదే-జగత్తు లేదు అని త్రినేత్ర కంటి వైద్యాలయానికి భూమి పూజ
చేసి 1993 లో త్రినేత్ర
వైద్యాలయము ప్రారంభించారు.
1996న ఆశ్రమ ఉత్తరాధికారిగా తన ప్రియ శిష్యుడు శ్రీ గోపాల్ స్వామి వారిని
శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామిగా ఆశీర్వదించి నియమించారు.
2001 జనవరి 31 న శ్రీవారి స్మృతి చిహ్నముగా శ్రీ విద్యాస్వరూపానందగిరి
స్వామి ఆధ్వర్యంలో దివ్యమైన ధ్యాన మందిరం(అధిష్టాన మందిరం) నిర్మాణం చేసి ప్రారంభించారు.
20). శ్రీవారి రచనలు: గీతామకరందం, వివేకానంద సింహనాదం, ఆద్యాత్మిక జడ్జిమెంట్, మోక్షసాధన రహస్యం, తత్త్వసారం, మానసబోధ, రామాయణ రత్నాకరం, భాగవత రత్నాకరం, ఉపనిషత్ రత్నాకరం, పాండవ గీత, బ్రహ్మచర్య విజయం, వాసిష్ఠ మహారామాయణం, ఆత్మానుసంధానం మొదలగునవి.(వివరాలు -బుక్స్ TAB చూడగలరు.)
21) గురుదేవుల చిత్రాలు
21) గురుదేవుల చిత్రాలు