ఆహ్వానముఓం సచ్చిదానన్దరూపం తం సర్వశాస్త్రార్థ బోధకమ్ | విద్యాప్రకాశ నామానం సద్గురుం ప్రణమామ్యహమ్ | శ్రీగురుదేవులు పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి ఇరువది ఆరవ పుణ్యారాధన, 111 వ జన్మ దినోత్సవము మరియు 74వ ఆశ్రమ వార్షికోత్సవము22-4-2024 : 26-4-2024 తేదీలందు.**********శ్రీ శుకబ్రహ్మాశ్రమ స్థాపకులు, గీతామకరంద రచయిత, విఖ్యాత గీతోపన్యాసకులగు గురుదేవులు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి ఇరువది ఆరవ పుణ్యారాధన క్రోధి నామ సంవత్సర చైత్ర | శుద్ధ చతుర్దశి సోమవారం అనగా 22-4-2024వ తేదీన, అట్లే శ్రీస్వాములవారి 111వ జన్మదినోత్సవం చైత్ర బహుళ తదియ శుక్రవారం...