గీతామకరందము18-78
18-78-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అll శ్రీకృష్ణారునులుండుచోట విజయము, ఐశ్వర్యము మున్నగు శుభలక్షణములు వెలయుచుండునని సంజయుడు పలుకుచున్నాడు –
యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిః
ధృవా నీతిర్మతిర్మమ ||
తా:- ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను , ఎచట ధనుర్ధారియగు అర్జునుడున్ను ఉందురో అచట సంపదయు, విజయమున్ను ఐశ్వర్యమున్ను, దృఢమగు నీతియు ఉండునని నా యభిప్రాయము.
వ్యాఖ్య:- గీతా గ్రంథ మీశ్లోకముతో సుసంపన్నమగుచున్నది....
Read more...